Lisa Movie Pre-Release Event | Anjali | Suresh Kondeti || Filmibeat Telugu

2019-05-20 554

Actress Anjali's latest movie Lisa movie set to release on May 24th. This movie's pre release event held in hyderabad yesterday. In this occassion, Anjali said, Lisa movie my first 3D movie. It gives immense happyness. this movie will give hit like journey and Shopping mall.
#ActressAnjali
#Sureshkondeti
#RajuVishwanath
#LisaMovie
#Lisa3Dmovie
#Tollywood
#kollywood
#santoshdayanidhi

అంజ‌లి తెలుగు అమ్మాయే అయినా త‌మిళ ప్రేక్షకుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం.ఈ అమ్మడు ఇప్పుడు ‘లిసా’ అనే సినిమా చేస్తోంది. ఇదో త్రీడీ సినిమా. అస‌లు త్రీడీలో న‌టించ‌డం చాలా చాలా క‌ష్టంగా చెప్పుకొస్తోంది అంజ‌లి. ఆస్కార్ రేంజ్ న‌ట‌న క‌న‌బ‌రిచినా.. సింగిల్ టేక్‌లో ఓకే కావ‌డం అంటూ జ‌ర‌గ‌ద‌ని అంటుందీ అమ్మడు. ‘మాములు సినిమాలు వేరు త్రీడీ సినిమాలు వేరు. కెమెరా మేన్ ఓకే అంటే కానీ ఇక్కడ షాట్ కంప్లీట్ కాదు. అదెప్పుడ‌వుతుందో తెలీదు’ అని అంటోంది అంజ‌లి. ‘లిసా’ త్రీడీ కూడా హ‌ర్రర్ చిత్రమే. హ‌ర్రర్ చిత్రాల్లో న‌టించిన‌ప్పుడు వాటిని తెర మీద చూసినా పెద్దగా భ‌యం వేయ‌టం లేద‌ని అంటోంది అంజ‌లి. ‘షూటింగ్ టైంలోనే క‌థ మొత్తం తెలిసిపోతుంది. ఇక తెర‌పై చూశాక ఆ థ్రిల్లెక్కడుంటుందీ? అదేదో ప్రేక్షకులు ఫీల‌వ్వాల్సిందే త‌ప్ప.. త‌మ‌లాంటి న‌టీన‌టుల‌కు ఆ ఛాన్సే లేదు’ అని కొత్త హర్రర్ థియ‌రీ బ‌య‌ట‌కు లాగింది అంజ‌లి. వీటినెలా తీస్తారో తెలిసి పోయాక అస్సలు భ‌య‌మేలా వ‌స్తుంద‌ని ప్రశ్నిస్తోంది అంజ‌లి.